Telugu Rasiphalalu Today 7th February 2018

Panchangam  దిన పంచాంగము – 07-02-2018ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


మాఘమాసము

బుధవారము

తిది –కృష్ణ పక్ష సప్తమి పగలు 12.33 వరకు

నక్షత్రము – స్వాతి పగలు 03.57 వరకు

అమృత గడియలు – ఉదయం 06.49  నుండి 08.28 వరకు  

దుర్ముహుర్థము-పగలు 11.53 నుండి 12.39 వరకు

యమ గండము – ఉదయం 07.30  నుండి 09.00 వరకు

వర్జము –రాత్రి 09.53 నుండి 11.34 వరకు

రాహు కాలము-పగలు 12.00  నుండి 01.30 వరకు


RasiPhalalu రాశిపలాలు 07-02-2018

aries-single-iconమేష రాశి

 పేరు ప్రతిష్టలు పెరిగి చాల ఆనందముగా ఉంటారు . సభలు , సన్మాలలో పాల్గొంటారు . దనాదాయము అనుకూలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగావకాశాలు పొందే అవకాశాలు ఉన్నాయి . ప్రతి పనిలోనూ కార్య జయాన్ని పొంద గలరు . గోరవ ప్రతిష్టలు పెరుగుతాయి . విద్యార్దులకు ఉన్నత విద్య ప్రాప్తి కలుగుతుంది . కంపస్స్ సెలక్షన్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి . స్త్రీలకూ పుట్టింటి వారి సహకారం లభిస్తుంది .


 taurus-single-iconవృషభ రాశి

 సోదర బంధువులతో విబేదాలు వచ్చి శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి .కొంత అనారోగ్య సమస్యలు బాద పడే అవకాశాలు ఉన్నాయి . నీచ సాంగత్యము ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . హృదయ సంబంద అనారోగ్య సూచనలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తులతో విరోడలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు విద్యా ఆటంకాలు సంబవించే అవకాశాలు .స్త్రీలలో సోదరులతో విరోదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .


gemini-single-iconమిదున రాశ

  ప్రతి నిర్ణయం లోను తడపాటు , నిర్ణయ లోపం ఏర్పడుతుంది . అదిక ధనము కర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి . నూతన వ్యాపారాల గురించి ఆలోచనలు వస్తాయి .వ్యాపారము సామాన్యముగా ఉంటుంది .దూర బంధువులను కలుస్తారు . రావలసిన ధనము చేతికందుతుంది .విద్యార్దులకు ప్రోత్సాహము ఉంటుంది . స్త్రీలకూ వస్తులాభము ఉంటుంది .ఉద్యోగస్తులకు గడ్డుకాలంగా ఉంటుంది . ఆర్దిక వత్తుడులుంటాయి . ప్రతి విషయం లోను భయముంటుంది .


cancer-single-iconకర్కాటక రాశి

 ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి . విదేశ ఉద్యోగం ప్రయత్నం విజయవంతమౌతుంది . వ్యాపారము ధనాదాయముంటుంది . స్నేహితుల సహకారము లభిస్తుంది . కుటుంబ విబేదాలు తొలగి ఆనందముగా ఉంటారు . బూమి కొనుగోలు ప్రయత్నం చేస్తారు . విద్యార్దులకు ఉన్నత విద్యావకాశాలు బలంగా ఉన్నాయి . పెద్దల సహకారము లభిస్తుంది . స్త్రీలకూ ఉద్యోగంలో వత్తిడి ఉంటుంది . మానసిక బాదలుంటాయి .


leo-single-iconసింహ రాశి

  గృహములో సుభ కారార్య ప్రయత్నం విజయ వంతమౌతుంది . భులాభం ఉంటుంది . రాదు అనుకున్న ధనము చేతికందుతుంది .అనవసర కర్చులు ఉంటాయి . ఉద్యోగస్తులకు చాల అనుకూలంగా ఉంటుంది . పై అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి . విద్యార్దులు ఇతర దెస ఉన్నత విద్యా అవకాశాలు బలంగా ఉన్నాయి . సంకల్ప సిద్ది వల్ల అనుకున్నది అనుకున్నట్లు సాదిస్తారు . స్త్రీలకూ పితృ ఆస్తులు కలసి వస్తాయి . అంతా అనుకూలంగా ఉంటుంది .


virgo-single-iconకన్యా  రాశి

  విపరీతమైన ఆలోచనలవలన ;వత్తిడికి గురౌతారు . కండరాల సంబంద అనారోగ్య సూచనలు ఉన్నాయి . విసుగు కోపము పెరుగుతుంది . దానివల్ల మిత్రులే  శత్రువులు  అయ్యే అవకాశాలు ఉన్నాయి . పనుల్లో జాప్యం జరుగుతంది . కొన్ని విషయాలలో పరాభం వరకు వస్తుంది . ప్రతి విషయం లో జాగ్రత్తగా తప్పుకోవటం మంచిది .విద్యార్దులకు గడ్డు పరిస్తితి ఉంటుంది . ఉద్యోగస్తులు చాల జాగ్రత్తగా మాట్లాడుట మంచిది . స్త్రీలకూ ఈర్ష్య ద్వేషాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .


libra-single-iconతులా రాశి

  కుటుంబములో వివాదాలు ఏర్పడి మనస్సు వత్తిడికి గురౌతుంది . మిత్ర శత్రుత్వం పెరుగుతంది .బాగస్తుల వ్యాపారము నష్టాలకు తావు ఉంటుంది .అప్పు చేయ వలసి వస్తుంది .రావలసిన ధనము చేతికందక కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది .ఉద్యోగస్తులకు అధికారులకు భలి అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్త గా ఉండవలసి వస్తుంది .విద్యార్దులకు కష్టాలకు తగిన పలితము అందక ఇబ్బంది పడతారు .స్త్రీలకూ కార్య బంగము కలుగుతుంది


scorpio-single-iconవృశ్చిక రాశి

 భుసంబంద వివాదాలు తొలగి దాని వలన రావలసిన ధనము చేతికందుతుంది .వ్యాపరతులకు అదిక ధన లాభాముంటుంది .స్నేహితులసహకారము ఉంటుంది . ప్రతి పని లోను కార్య జయాన్ని పొంద గలరు .గర్వము పెరిగి కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది .వ్యపారాభివ్రుద్ది చెందుతుంది .అనుకున్నది సాదిస్తారు .ఉద్యోగస్తులకు అన్నిటా అనుకూలంగా ఉంటుంది .విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .


sagittarius-single-iconధనుస్సు రాశి

 అన్నిరకాలుగా అనారోగ్య సమస్యలు తలెత్తి ఇబ్బందులకు గురి కాగలరు . సోదర , సోదరీమనణులతో మనస్పర్దలకు తావున్నది చాలా జాగ్రత్తగా మసలుకోగలరు . చిన్న  చిన్న ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కోవాసి వస్తుంది . అందరితో విరోదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .ఉద్యోగస్తులు సమస్యలు కోరి కొనుక్కుంటారు . మానస్సిక వత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు నిర్లక్ష్యం పెరిగి విద్యా ఆటంకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి .


capricorn-single-iconమకర రాశి

 అదిక కర్చులు . ఆర్దిక ఇబ్బందులు ఉంటాయి . వ్యారములో ధన నష్టాలు చూడ వలసి వస్తుంది . రావలసిన ధనము అందక కొన్ని సమస్యలు విరోదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .ఉద్యోగస్తులకు ఆరోగ్య సమస్యల వల్ల కర్చు ర్పడి ఇబ్బందులు పడతారు . వ్యాపారస్తులకు శ్రమకు తగిన పలితము ఉండదు .విద్యార్దులకు కూడా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి .స్త్రీలకూ విసుగు కోపము పెరుగుతుంది .


aquarius-single-iconకుంబ రాశి

  ఆరోగ్య రీత్యా జీర్ణ సంబంద అనారోగ్యం ఉంటుంది . విసుగు కోపం పెరిగి శత్రుత్వం వస్తుంది .అనుకున్న ప్రతి పని ప్రతి కూలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు పరిక్షా కాలంగా ఉంటుంది .వ్యాపారము దన నష్టము ఉంటుంది .బాగాస్తులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .అదిక కర్చు ఉంటుంది . ఆదాయానికి మించి కర్చులుంటాయి . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ఉన్నాయి . స్త్రీలకూ అనారోగ్య సూచనలు ఉన్నాయి .


pisces-single-iconమీన రాశి

 శ్రమకు తగిన ధన లాభముంటుంది . నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి . ప్రతి ఆలోచన కార్యరూపానికి వచ్చి ఆనందాన్ని పొందుతారు . ధనాదాయము బాగుంటుంది . వ్యాపారాను అభివృద్ధి చెందుతుంది . ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది . విద్యార్దులకు విద్యా ప్రోత్సాహము లభించి విద్యాభివృద్ది కలుగుతుంది . స్త్రేలకు పెద్దల ప్రోత్సాహం వల్ల ఉన్నతి చెందుతారు . స్నేహితులను కలసి ఆనందముగా గడుపుతారు .