Telugu Daily Rasifala 9th February 2017
Telugu Daily Horoscope
Panchangam దిన పంచాంగము – 09-02-2017
BY Astrologer Jogiparthi Koteswara Rao
మాఘమాసము
గురువారము
తిది –శుక్ల పక్ష త్రయోదశి పగలు 09-06 వరకు
నక్షత్రము – పునర్వసు పగలు 10-49 వరకు
అమృత గడియలు – పగలు 08-32 నుండి 10-03 వరకు
తదుపరి రాత్రి 03-46 నుండి 05-18 వరకు
దుర్ముహుర్థము-పగలు 10-22 నుండి 11-07 వరకు
తదుపరి పగలు 02-55 నుండి 03-40 వరకు
యమ గండము – ఉదయం 06-00 నుండి 07-30 వరకు
వర్జము –రాత్రి 06-31 నుండి 08-03 వరకు
రా హు కాలము-పగలు 01-30 నుండి 03-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 09-02-2017
మేష రాశి
వీసాలు కొరకు ప్రయత్నం చేయు వారికి ఈరోజు చాల అనుకూలంగా ఉంటుంది . దూర దెస ధనము చేతికందుతుంది .అప్పులు తీరతాయి .బాంక్ బాలెన్స్ ఏర్పడుతుంది . భూమి కొనుగోలు అనుకూలిస్తుంది . గృహ యోగము ఏర్పడి సంతోషముగా ఉంటారు . ఉద్యోగస్తులకు మంద గమనము ఉంటుంది . విద్యార్దులకు బద్ధకం వల్ల విద్య మందగిస్తుంది .
వృషభ రాశి
కుటుంబ కలహాలు వాటివల్ల మానసిక వత్తిడి ఉంటుంది . అవసరానికి డబ్బు అంది సమస్య తీరుతుంది .వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి . ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి . చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల కుంటూ పడే అవకాశాలు ఉంటాయి . స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది .
మిదున రాశ
ఆదాయానికి తగిన కర్చు ఏర్పడుతుంది . విదేశ యాత్రలకు అవకాశం వస్తుంది . విదేశ వ్యాపారము చేయు వారికి అనుకూలంగా ఉంటుంది .శివ దర్శనము కలుగుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . ఆనందముగా ఉంటారు . విద్యార్దులకు ఉన్నత విద్యా అవకాశాలు ఉంటాయి . స్నేహితుల సహకారము ఉంటుంది .
కర్కాటక రాశి
ప్రతి పనిలో మనోదైర్యము పెరుగుతుంది . అనుకూలమైన వాతావరణము ఉంటుంది .దూర ప్రయాణములు చేస్తారు . ధనాదయము ఉంటుంది . రావలసిన పైకము చేతికందుతుంది. కొన్ని బాకీలు తీరుతాయి . ఉద్యోగస్తులకు దూర బదిలీలు ఉంటాయి . స్నేహితుల తో విరోధము ఉంటుంది . విద్యార్దులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది . స్త్రీలకూ కర్చు అదికంగా ఉంటుంది .
సింహ రాశి
ఊహించని ధన లాభాముంటుంది . దూర ప్రయాణాలు చేయ వలసి వస్తుంది . నూతన వ్యాపార అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .ఉద్యోగస్తులకు అధికారుల మెప్పు రివార్డ్స్ పొందే అవకాశాలు ఉన్నాయి .స్త్రీలకూ అలంకార వస్తు ప్రాప్తి పొందగలరు . విద్యార్దులకు నూతన ఉత్సాహముతో ముదుకు అడుగేస్తారు . సుభ వార్తలు వింటారు .
కన్యా రాశి
రాశి దాంపత్యములో చిన్న చిన్న వివాదములు ఉండే అవకాశాలు ఉంటాయి .సోదరులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మసలుకోగలరు . వ్యాపారములో ధన నష్టము వచ్చే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ఉంటాయి .
తులా రాశి
ఉన్నత ఉద్యోగం ఏర్పడుతుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి . దూర ప్రయాణాలు కల్సి వస్తాయి . స్నేహితుల సహకారము ఉంటుంది . బాగస్తుల వల్ల ధన లాభాముంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము లభిస్తుంది . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలకు అనుకూలమైన గృహ వాతావరణము ఉంటుంది .
వృశ్చిక రాశి
గృహ , భూమి కొనుగోలు అనుకూలిస్తాయి . మద్య వర్తులతో జాగ్రత్తగా ఉండాలి . వ్యాపారము చాలా అనుకూలంగా ఉంటాయి . ధన లాభము ఉంటుంది .పథ స్నేహితుల కలయిక ఉంటుంది .ఉద్యోగస్తులకు పదోన్నతి కలుగుతుంది . విద్యార్దులలో ఉత్సాహం కలుగుతుంది . స్త్రీలకూ నూతన వస్త్ర లాభము ఉంటుంది .
ధనుస్సు రాశి
అనారోగ్యానికి ధనము కర్చు ఔతుంది . రావలసిన ధనము చేతికి అందక కొన్ని ఇబ్బందులు పద వలసి వస్తుంది . అప్పు చేయ వలసి వస్తుంది . వ్యాపారములో కూడా కొన్ని నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .ఉద్యోగస్తులకు బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు ఆటంకాలు ఉంటాయి . స్త్రీలకూ ధన లాభము ఉంటుంది .
మకర రాశి
కుంబ రాశి మొండి ప్రవర్తన వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురౌతాయి .శత్రుత్వం పెరుగుతుంది . విరోదాల వల్ల మనస్సు దెబ్బ తింటుంది .బందు విరోదాలు. వ్యాపారస్తులకు దన నష్టాలు పొందే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాని కష్టముతో కూడి ఉంటుంది .
కుంబ రాశి
ఉద్యోగస్తులకు ఉన్నత పదవి ప్రాప్తము ఉంటుంది .జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .వ్యాపారస్తులకు ధన లాభముంటుంది . నూతన వ్యాపార అవకాశాలు ఉంటాయి . స్నేహితుల సహకారముంటుంది . బాగస్తుల వల్ల ధనాదాయముంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . సంతాన సుఖముంటుంది .
మీన రాశి
ధనముకోరకు చేయు ప్రయత్నాలు సరైన పలితము అందక కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి .అప్పు చేయ వలసి వస్తుంది . వ్యాపారస్తులకు కొన్ని నష్టాలూ చవి చూడవలసి వస్తుంది .మాసిక , పని వత్తిడి ఉంటుంది . ఉద్యోగస్తులకు పనిష్మెంట్లు , ఫెనాల్టీలు కట్టవలసి వస్తుంది .చాల జాగ్రత్తగా .మసలుకొండం మంచిది .