Telugu Rasiphalalu Today 12th January 2018

Panchangam  దిన పంచాంగము – 12-01-2018ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


పుష్యమాసము

శుక్రవారము

తిది –కృష్ణపక్ష ఏకాదశి రాత్రి 10.56 వరకు

నక్షత్రము – విశాఖ పగలు 09.41 వరకు

అమృత గడియలు – రాత్రి 12.32 నుండి 02.16 వరకు

దుర్ముహుర్థము-పగలు 08.50 నుండి 09.35 వరకు

తదుపరి పగలు 12.32 నుండి 01.16 వరకు

యమ గండము – పగలు 03.00  నుండి 04.30 వరకు

వర్జము –పగలు 02.03 నుండి 03.48 వరకు

రా హు కాలము-పగలు 10.30 నుండి 12.00 వరకు                                                                             


RasiPhalalu రాశిపలాలు 12-01-2018

aries-single-iconమేష రాశి

 ప్రతి ఆలోచనా కార్య రూపం దాలుస్తాయి . మనో దైర్యము పెరుగుతుంది . వ్యాపారములో అదిక లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహకారము లభిస్తుంది . కొన్ని బాధ్యతలలో తప్పించుకొనుట మంచిది . బ్యాంకు ఉద్యోగస్తులకు కష్ట కాలంగా ఉంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలకూ సుభ పరిణామాలే ఉంటాయి .


 taurus-single-iconవృషభ రాశి

 విదేశ ఉద్యోగ , విద్య ప్రయత్నాలకు మంచి అవకాశము ఉంటుంది . ఆర్దిక ఇబ్బందులు మాత్రం వెంటాడుతూనే ఉంటాయి . మాట కటువుగా ఉండటం వలన శత్రువులు కూడా  పెరిగే అవకాశాలు ఉన్నాయి . అప్పులు చేయ వలసి వస్తుంది . ఉద్యోగస్తులకు అధికారుల ఆగ్రహానికి లోను కావలసి వస్తుంది .


gemini-single-iconమిదున రాశ

  మిత్రులతో విబేదాలు , సోదరుల వల్ల ధన నష్టము సంబవిస్తుంది . అనారోగ్య సమస్యలుంటాయి . శత్రువులు పెరుగుతారు . వ్యాపారములో ధన నష్టాలూ చవి చూస్తారు . ఉద్యోగస్తులకు కష్ట కాలంగా ఉంటుంది . విద్యార్దులలో నిరుత్సాహము ఏర్పడుతుంది . స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది .


cancer-single-iconకర్కాటక రాశి

 ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది . ప్రతి పనిలో ప్రోత్సాహము లభిస్తుంది . కుటుంబములో సుభ కార్య ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది . ధన లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల ప్రోత్సాహముతో కొన్ని సమస్యలనుండి బయట పడతారు . విద్యార్దులకు ఉన్నత విద్యావకాశాలు ఉంటాయి


leo-single-iconసింహ రాశి

  విదేశ ఉద్యోగ అవకాశాలు బలంగా ఉంటాయి . విదేశ ప్రయాణాలకు అవకాశాలు వస్తాయి .విహార యాత్రలు చేస్తారు . ఉద్యోగస్తులకు బదిలీలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . విద్యార్దులకు ప్రోత్సాహకంగా ఉంటుంది . స్త్రీలకూ మనోల్లాసము పెరిగి ఆనందముగా ఉంటారు . కొన్ని విషయాలలో ప్రోత్సాహము లభిస్తుంది


virgo-single-iconకన్యా  రాశి

  మనస్సు లో ఎదో తెలియని భయం ఏర్పడుతుంది . ప్రతి పనిలో కూడా ధన నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి . తగు జాగ్రత్తగా ఉండవలెను .అనుకోని కర్చులు పడే అవకాశాలు ఉన్నాయి . విదేశ ప్రయాణాలు ఉంటాయి . లేదా విదేశ ధనము చేతికందుతుంది . ఎన్ని ఉన్న మనస్సు వికలత చెందుతుంది . విద్యార్దులకు విద్యాభివృద్ది ఉంటుంది .


libra-single-iconతులా రాశి

  వ్యాపారాలలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది . బాగాస్తులతో కూడిన వ్యాపారము చాల బాగుంటుంది . స్నేహితుల సహకారము లభిస్తుంది . ఉద్యోగస్తులకు ఉన్నత స్తితి పొంద గలరు . స్త్రీలకు ఆభరణ ప్రాప్తి ఉంటుంది . విద్యార్దులకు స్నేహితుల సహకారము తో విద్యాభివృద్ది ఉంటుంది .


scorpio-single-iconవృశ్చిక రాశి

 ప్రతి పనిలో చేతికందినట్టే ఉండి చేయి జారి పోతుంటుంది . మతి మరుపు పెరిగి ఇబ్బంది పడతారు .ఉద్యోగస్తులకు పనిస్మెంట్లు పడతాయి . విద్యార్దులకు విద్య కుంటుపడి ఇబ్బందులకు గురౌతారు శత్రుత్వం పెరుగుతుంది . మానసిక అనారోగ్య సమస్యలుంటాయి . విద్యార్దులలో నిర్లక్క్ష్యం పెరుగుతుంది . భయము తగ్గుతుంది .


sagittarius-single-iconధనుస్సు రాశి

 విద్యార్దులు చేయు ఉద్యోగ ప్రయత్నములు విజయవంతముగా నేర వేరుతాయి . విదేశ విద్య , ఉద్యోగ ప్రయత్నములు మంచి పలితాన్ని ఇస్తాయి . ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలనుండి బయట పడతారు . విద్యార్దులలో ఉత్సాహము పెరిగి అబివృద్ది బాట పడతారు . స్త్రీలకూ అన్ని విషయాలలో అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు .


capricorn-single-iconమకర రాశి

  నిర్ణయాలు దైర్యముగా తీసుకోలేక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు పదవి భయము ఏర్పడుతుంది . చంచల మనస్సు కలిగి ఉంటారు . వ్యాపారములో నిలకడ లేని స్తితి ఉంటుంది . విద్యార్దులకు నిర్లక్ష్యము పెరిగి విద్యలో ఆటంకాలు ఉంటాయి . అపనిందలు పడే అవకాశాలు ఉన్నాయి .


aquarius-single-iconకుంబ రాశి

  బాగాస్తులతో విబేదాలు , లేక మోసపోవటమే జరుగుతుంది . జాగ్రత్తగా ఉండటం పంచిది .సోదరులతో . భార్యతో విరోధము ఏర్పడుతుంది . పర నింద మోయవలసి వస్తుంది .వ్యాపారము లాభదాయకముగా ఉంటుంది . రావలసిన ధనము చేతికందుతుంది .ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు విద్యాభి వృద్ది ఉంటుంది .


pisces-single-iconమీన రాశి

 కుటుంబ కలహాలు , భార్యతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . సోదరులకు అనారోగ్య సమస్యలవలన మనస్సు వికలంగా ఉంటుంది . కార్యాచరణ లోపం ఏర్పడుతుంది .వ్యాపారము కూడా మండగిస్తుంది . ధనము కార్చి ఉంటుంది . స్త్రీలకూ మాసిక వట్టుదలకు గురౌతారు . విద్యార్దులకు విద్యమీద మనస్సు నిలక ఉండక ఆటంకాలు ఉంటాయి